Smt.Karuna Pillai,Chief PMG
Welcome to the news blog of Andhra Pradesh Postal Circle.

Pages

Saturday, March 17, 2012

0 2012-13 వార్షిక బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు

pranab mukherjee
కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం 2012-13 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2012-13 బడ్జెట్ మొత్తం వ్యయం అంచనారూ.14,19,925 కోట్లుగా ప్రకటించారు. ఇందులో 2012-13 ప్రణాళిక వ్యయంగా రూ.5,21,025 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.9,69,900 కోట్లు, 2012-13 సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా 1,85,752 కోట్లుగా అంచనా వేశారు. అయితే పన్ను వసూళ్లలో రూ.32వేల కోట్ల తగ్గుదల కనిపించనుంది. ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటు 5.9 శాతంగా ఉండగా, 2011-12 వృద్ధి రేటు 6.9 శాతం నమోదైనట్టు ఆయన తెలిపారు. ఈ బడ్జెట్‌లో కీలక రంగాలకు కేటాయించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* రక్షణ శాఖకు రూ.1,93,407 కోట్లు
* ఆక్వా రంగానికి రూ.5000 కోట్లు
* చేనేత రుణ మాఫీ రూ.3,884 కోట్లు
* బలహీన వర్గాలకు రూ.8,400 కోట్లు
* ఏఐడిపి కార్యక్రమానికి రూ.14 వేల కోట్లు
* మధ్యాహ్న భోజనానికి రూ.11,930 కోట్లు
* సర్వ శిక్షా అభియాన్‌కు రూ.25,555 కోట్లు
* హరిత విప్లవ పథకానికి రూ.1000 కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.10 వేల కోట్లు
* కృషి వికాస్ యోజనకు రూ.7860 కోట్లు
* దేశంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు
* తాగునీరు, పారిశుద్ధ్యం రంగానికి రూ.14 వేల కోట్లు
* తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతి
* ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.24 వేల కోట్లు
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.5 వేల కోట్లు
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు రూ.20,822 కోట్లు
* వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.12,040 కోట్లు
* నీటి పారుదల రంగం బలోపేతానికి రూ.300 కోట్లు
* వ్యవసాయ రుణ లక్ష్యం రూ.5.75 లక్షల కోట్లు
* కేరళ వ్యవసాయ విద్యాలయానికి రూ.100 కోట్లు
* ఆనంద్ రూరల్ మేనేజ్ మెంట్ సంస్థకు 25 వేల కోట్లు
* నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కు రూ.1000 కోట్లు
* హైదరాబాద్ ఎన్‌జి.రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.వంద కోట్ల నిధి
* పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ రూ.కోటికి పెంపు
* ఎల్‌సిడి, ఎల్‌ఈడి దిగుమతి సుంకం తగ్గింపు, ధరలు తగ్గే అవకాశం
* వితంతు పింఛన్లు రూ.200 నుంచి రూ.300కు పెంపు
* నాబార్డ్, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ.15,888 కోట్లు
* 1000 మంది జనాభా ఉన్న పల్లెలకు కూడా స్వాభిమాన్ పథకం
* గుంటూరు, ప్రకాశం జిల్లాలో హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు
* రైతులకు స్వల్పకాలిక రుణాలకై నాబార్డ్ ద్వారా రూ.10 వేల కోట్లు
* కుటుంబ లబ్ధి పథకం కింద రూ.10 వేల నుండి రూ.20 వేలకు పెంపు
* 12వ ప్రణాలికలో పారిశ్రామిక మౌలిక వసతుల కోసం రూ.50 లక్షల కోట్లు
* జాతీయ రహదారుల సంస్థకు బాండ్ల ద్వారా 10 వేల కోట్లు సమకూరుస్తాం
* కొత్తగా రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం, రూ.50 వేలు ఆదాయ పన్ను రాయితీ
* జాతీయ రహదారుల అభివృద్ధి పథకంలో 8,800 కి.మీ. జాతీయ రహదారులు.
* మార్కెట్ ధరకే ఎల్ పీజీ గ్యాస్ అమ్మకం, తొలిదశలో మైసూర్ లో అమలు.

0 comments:

Post a Comment